కొత్త పదసంచిక-6

0
3

‘కొత్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. ఉర్దూ హేండ్ రైటింగ్!(4).
04. వినాయకుడు! తెలుగులో కాదు!(4).
07. వీరంతా మా బలగము. వ్రాసుకోండి.(5).
08. ఋషులు చేసేది చివరకు గల్లంతు!(2).
10. ఒక క్రమము అంటూ లేని శౌర్యం.(2).
11. చదువుల తల్లి హస్త భూషణం.(3).
13. నాలుగు తన్ని కాదు నాలుగు తల్లి!(3).
14. కారములో లేనిది కార్యములో ఉన్నాది!(3).
15. ఎవరు మీ టీచరు? డాగు అంటే కుక్క కాదు. (3).
16. దండ వెనుక నుండి పడింది. చూశారా?(3).
18. లేదు అంటూ ప్రారంభించే పూజ!(2).
21. మునిపల్లె లావణ్య పొడిగా.(2).
22. రీసెర్చ్ అంటే మధ్యలో శీల పరీక్ష ఉండాలా? (5).
24. ఇదో మీసాల దేవుని ఊరు. చూడాలంటే అటునుంచి రండి.(4).
25. ఏదైనా విపరీతం జరిగితే పాపం ఈ యూగాన్ని ఆడిపోసుకుంటారు!(4).

నిలువు:

01. ఆనక తడబడ్డారా?(4).
02. ఎంతని సహిస్తాడు?! తిరగబడ్డాడు భర్త! (2).
03. సమీపంలోనే ఉంది కచేరి! సరిగ్గా చూడండి. (3).
04. తెలుగు లో ముద్దులా కనిపించినా హిందీలో వేడి సుమండీ!(3).
05. మూడు గంటలు!(2).
06. అడ్డం నాలుగు తండ్రి గారు విశేషణంగా.(4).
09. చేతికి పని కల్పించేది.(5).
10. నష్టాన్ని భర్తీ చేయాలంటే ఒక చెయిన్ కావాలి. (5).
12. వ్యాకరణం తెలుసా?ప్రాస లేని లేహ్యము.(3).
15. ఆహా! హృదయంగమము! ప్రారంభం కోసం స్వరాభిషేకం తో ఈయన వస్తారు.(4).
17. పాల కడలి లో ఉద్భవించింది.(4).
19. పిల్లాడు తప్పటడుగులు ప్రారంభిస్తే దీని మీద తలక్రిందులుగా నడిపించాలి.(3).
20. సత్యభామకు శోభ చేకూర్చేది.(3)
22. ఆపన్నశరుణ్యులలో దీనుడు, నీచుడు, సేవకుడు!(2).
23. నలిపి చేసే పొడి!(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 సెప్టెంబరు 14 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 6 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 సెప్టెంబరు 19 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-4 జవాబులు:

అడ్డం:   

1.లుటేరాలు 4.ముసభ్యాఅ 7.వామపాదము 8.మకాం 10.చివే 11.అచలం 13.సొరంగం 14.పరక 15.నసీబు 16.అవును 18.జత 21.లుడి 22.మీనమేషాలు 24.నాకలోకం 25.రామేశ్వరం

నిలువు:

1.లురుమఅ 2.రావా 3.లుమదో 4.ముదము 5.సము 6.అతివేగం 9.కాంచనసీత 10.చిరంజీవులు 12.వరడు 15.నజరానా 17.నుడికారం 19.శునకం 20.ఇషారా 22.మీలో 23.లుమే

కొత్త పదసంచిక-4 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అన్నపూర్ణ భవాని
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ల రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • ఈమని రమామణి
  • కల్యాణి యద్దనపూడి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • లలిత మల్లాది
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పార్వతి వేదుల
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here