[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
రాజశేఖర్ తటవర్తి
నమస్కారం..
నా పేరు రాజశేఖర్ తటవర్తి. స్వస్థలం కాకినాడ. ప్రస్తుత నివాసం మలేషియా. చదువు CA, MBA. జాబ్ – బ్యాంకర్.
సాహిత్యంలో ఆసక్తి మా కృష్ణ మావయ్య, చిన్న మావయ్య మరియు మా అమ్మగారి వల్ల పెరిగాయి. ఆంగ్ల, యురోపియన్ సాహిత్యం సెలవల్లో మా మావయ్య ఇంట్లో చదివేవాడిని.
తెలుగు సాహిత్యంలో అభిరుచి స్కూల్లో తెలుగు గద్య భాగం పాఠాలమూలంగా కలిగింది. (గోపిచంద్ గారి రిక్షావాడు పాఠం గుర్తుందా!).
ఎందరో మహానుభావులు స్ఫూర్తి ..O Henry, Maupassant, Dostoevsky, Zola, R.K Narayan, Premchand. మన తెలుగు సాహిత్యంలో.. తిలక్ గారు, కొడవటిగంటి గారు, గోపిచంద్ గారు, విశ్వనాథవారు.. ఈ లిస్ట్ చాలా పెద్దది..
అసలు రాయడం మొట్టమొదట పదేళ్లకే ప్రయత్రించాను… ‘పువ్వులు మాట్లాడితే’ నా మొదటి వ్యాసం.. (మా నాన్నగారి స్నేహితుడు ఇచ్చిన ఛాలెంజ్ అది). చిన్నప్పట్నుంచి వ్యాసాలు అవీ రాయడం అంటే మక్కువ..
అడపాదడపా రాసినా, తెలుగులో కథా వ్యాసంగం స్థిరంగా 2019 నుండి రాస్తున్నా..
ఒకవేళ పాఠకులు నా కథలు చదవాలనుకుంటే.. ఈ లింక్ లో చదవచ్చు.
https://www.facebook.com/rajasekhar.telugu.9406