[dropcap]ని[/dropcap]శ్శబ్దం
అరుదైన
నిశ్శబ్దం
ఒక కొత్త అనుభూతి
అన్నిటిలో ప్రవహిస్తూ
సూక్ష్మాతి సూక్ష్మంగా
సహజమైన జీవనదిలా
ఇంకా
విత్తులా మొలకెత్తుతూ
శూన్యాన్ని పెకిలించుకుంటూ
ఎంతో
ఓపిగ్గా
గోడకు పాకే తీగలా
చిగురిస్తూ
ఆకుల మధ్య పువ్వులా
పుప్పొడులను రాల్చుకుంటూ
సంతోషాన్ని పొదువుకుంటూ
అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ
ఇంకా
బ్రతికిన ఆనందం
తడి వాక్యాలుగా
మెరుస్తూ మురిపిస్తుంటాయి,
అచ్చు నీలా..