మా బాపట్ల కథలు – పుస్తక పరిచయం

0
4

[dropcap]ర[/dropcap]చయిత్రి భావరాజు పద్మిని రచించిన స్వంత ఊరు బాపట్ల జ్ఞాపకాల 28 కథల సంపుటి ‘మా బాపట్ల కథలు’. అమరావతి కథలు, గోదావరి కథలు, మా పసలపూడి కథలు వంటి పుస్తకాల ప్రభావంతో తన మనసులో నిక్షిప్తమైన ఊరి వాళ్ళ జ్ఞాపకాలనూ, ఆలోచనలనూ అక్షరాలలో పేర్చి అందించాలన్న ఆలోచన ఈ కథల రచనకు దారితీసిందని రచయిత్రి ముందుమాటలో చెప్తారు.

‘బాపట్ల కథలు చదువుతుంటే… అమరావతి కథలు గుర్తుకురావటం పద్మిని సాధించిన విజయమే’ అని తనికెళ్ళ భరణి ఆశీర్వదించారు.

‘ప్రతీ కథలోనూ మనదైన సంస్కృతి, మన పరిసరాలు, మనదైన భావాలు, బాంధవ్యాలూ, చల్లగా సాగే కాలువలు పద్మిని గారి కథలు’ అని భువనచంద్ర ‘తేనెలో మాగిన అరటిపండు’ అన్న ముందుమాటలో చెప్పారు.

ఈ సంపుటిలోని కథలలో ఒకప్పటి ‘బాపట్ల’, అక్కడి వ్యక్తులు, వ్యక్తిత్వాలు, జీవన విధానం, మనుషుల నడుమ ఆప్యాయతలు, అనుబంధాలు, అందమైన, అమాయకమైన బాల్యం పరిచయమవుతాయి.

‘మా భావనారాయణుడు’, ‘జీవన వేదం’, ‘పోలేరమ్మ దయ’, ‘అగ్గిపుల్ల ప్లీడరు’, ‘గోవిందమ్మ గారి నగలు’ వంటి కథలు అలరిస్తాయి. ఇందులోని కథలన్నీ చదివాక, ఇవి మనసున్న కథలు అనిపిస్తుంది.

***

మా బాపట్ల కథలు
రచన: భావరాజు పద్మినీ ప్రియదర్శిని
పేజీలు: 148
వెల: ₹ 200
ప్రచురణ: అచ్చంగా తెలుగు
ప్రతులకు:
12-5-32/14C
ఫ్లాట్ నెం. 402, శ్రీ మహాలక్ష్మి ప్రైడ్
విజయపురి కాలనీ, సౌత్ లాలాగుడా,
తార్నాకా, సికింద్రాబాద్
తెలంగాణా 500017
acchamgatelugu@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here