[dropcap]బా[/dropcap]ణాలు గురి తప్పుతాయి
భావాలు గురి తప్పుతాయి
మతానికి మతి తప్పుతుంది
గతం కాలగతిని తిప్పుతుంది
రాజులందరూ భావాల బానిసలే
రాజ్యాలన్నీ బానిసల స్వర్గాలే
వారసత్వం గా భావాల ప్రవాహం
భావాలు గురి తప్పినపుడే
జాతులు నాశనమవుతాయి!
గురి తప్పని, ఉరి లేని భావమే
జాతిని జాగృతం చేస్తుంది!