పౌరులలో అవగాహన, చైతన్యం కీలకం – అవే రక్షా కవచాలు

0
3

[box type=’note’ fontsize=’16’] జెనరిక్ మందుల వినియోగం పెరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ చిన్న వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

[dropcap]వి[/dropcap]నియోగదారులలో చైతన్యం అధికంగా ఉండటం, వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించిన చట్టాలు పటిష్ఠంగా ఉన్న కారణంగా అమెరికా వంటి దేశాలలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలూ ఎక్కువే. వైద్యసేవలలో లోపం కారణంగా నష్టం సంభవిస్తే చెల్లించవలసివచ్చే నష్టపరిహారాల మొత్తమూ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆ కారణంగా అక్కడే ఫార్మా కంపెనీలు, వైద్యశాలలు, వైద్యులు చాలా జాగ్రత్తగా ఆచితూచి మెలగవలసి ఉంటుంది.

కేసు బాదరబందీ కారణంగా వైద్యసేవలలో, మందుల పంపిణీలో సందిగ్ధత తలెత్తకుండా ఉండటానికి అమెరికా ఆరోగ్యమంత్రిత్వశాఖ అత్యవసర సంసిద్ధత, ప్రజాసన్నద్ధత చట్టం క్రింద ప్రజలకు కీలకమైన మందులను అందించే ఫార్మా కంపెనీలకు దావాల నుండి రక్షణ కల్పించింది. ఆ కారణంగా అక్కడి ప్రజలు ఇప్పుడు కేసులు వేయలేరు. ‘కోవిడ్’ నేపధ్యంలో అమెరికా తీసుకున్న ఆపద్ధర్మ నిర్ణయం అది.

బ్రిటన్ ఇంకొక అడుగు ముందుకు పోయి ‘పైజర్’తో బాటు వైద్య ఆరోగ్య సిబ్బందికీ ప్రజావ్యాజ్యాల నుండి రక్షణ కల్పించేలా చట్టం తీసుకు వచ్చింది.

ఎంత అహేతుకంగానూ అసందర్భంగానూ వ్యవహరించినప్పటికీ ఆమెరికా మాజీ అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ వాక్సిన్లకు సంబంధించిన పరిశోధనలు, ఉత్పత్తి, సేకరణల నిమిత్తం 2020 లోనే 2000 కోట్ల డాలర్లు కేటాయించారు. ఆ కారణంగానే సకాలంలో వేక్సిన్లను సమీకరించుకొని వేక్సినేషన్ ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగించుకోగలగటంతో బాటు మిగులు వేక్సిన్లతో ధీమాగా ఉండగలిగింది అమెరికా.

భారతదేశం 2021 బడ్జెట్‌లో కేటాయించినది 35000 కోట్ల రూపాయలు. అందులో ఖర్చుపెట్టినది 14% అంటే 250 కోట్ల రూపాయలు.

తలకుమించిన భారం అవుతున్న వైద్యఖర్చులు:

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే. బ్రిటన్ 1940లోనే ‘నేషనల్ హెల్త్ పాలసీ’ని అమలులోకి తెచ్చింది. ఆ కారణంగా దాదాపు 82% వరకు వైద్యఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. డెన్మార్క్‌లో ప్రజల ఖర్చును అత్యధికంగా 85% వరకు ప్రభుత్వమే భరిస్తుంది. చైనాలో అది 56% కాగా U.S.లో ప్రజలు తమ వైద్యఖర్చులలో 48% వరకూ రాయితీ పొందుతారు.

ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వాల ఖర్చు ప్రపంచ సగటు G.D.Pలో 5.4 శాతం. మన దేశంలో అది నిన్న మొన్నటి వరకు దేశ జి.డి.పిలో 1.5 శాతం. దానిని 2.5 శాతానికి పెంచాలన్న ఆలోచన ఇటీవల సంవత్సరాలలోనే రూపుదాల్చింది. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాలు నిధులు తక్కువగానే ఉన్నప్పటికీ మంచి ఫలితాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయి.

జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ లలో అద్భుతమైన వసతులు ప్రైవేట్ రంగంలోనే అధికం. అయినప్పటికీ వైద్య సేవల నాణ్యత, ధర, చికిత్స విధానాలపై ప్రభుత్వాలకి పూర్తి అదుపు ఉంటుంది. మన దేశంలో ఈనాటికీ చాలా మంది ప్రజలు తమ వైద్య ఖర్చులను తామే భరిస్తున్నారు. ప్రభుత్వ విధానాల ద్వారా ఆరోగ్య సేవలు అందుతున్న వారి సంఖ్య తక్కువే. అదీ భారత ప్రభుత్వం 2017లో వెలువరించిన ‘జాతీయ ఆరోగ్య విధానం’  (నేషనల్ హెల్త్ పాలసీ) ఫలితమే. వైద్యఖర్చులు భరించలేక ఏటా కొన్ని కోట్ల మంది దారిద్ర్యంలోకి వెళ్లిపోతున్నారు.

జెనరిక్ మందులు – నాణ్యతలో ఏ మాత్రం తీసిపోవు. ధర అందుబాటులో ఉంటుంది. జనసామాన్యానికి నాణ్యమైన మందులు తక్కువ ధరలో విస్తారంగా లభించాలని అబ్దుల్ కలామ్ ఆశించేవారు. జెనరిక్ ఔషదాలు వినియోగం విస్తరిస్తే ఆయన కల నెరవేరినట్లే. దేశంలో వైద్యులు జెనరిక్ మందులను సిఫార్సు చేయడాన్ని చట్టపరిధిలోనికి తీసుకోని వస్తామని ‘జాతీయ ఆరోగ్యవిధానం’ ప్రకటన సందర్భంగా మోదీ చెప్పారు. నిజానికి అదే జరిగితే వైద్య ఖర్చులను తగ్గించడంలో మంచి ముందడుగు అవుతుంది.

అమెరికాలో వైద్యులు సిఫార్సు చేసే వాటిలో 80%  జైనరిక్ జౌషదాలే. జెనరిక్ ఔషదాల వినియోగం పెరిగాక అక్కడ కేవలం 2015 సంవత్సరంలోనే రమారమి 14 లక్షల కోట్ల ఆదా అయ్యాయని జెనరిక్ ఫార్మా సంఘం (G.P.H.A) అధ్యయనం వెలువరించిన నివేదిక స్పష్టం చేసింది. అంత క్రితం 2005 నుండి 2015 మధ్య కాలంలో (10 సంవత్సరాల) 94 లక్షల కోట్ల ఆదా అయ్యిందని లెక్క తేల్చింది. జెనరిక్ మందుల ఉపయోగం, ప్రాముఖ్యత ఆ లెక్కలను పరిశీలిస్తేనే తెలుస్తోంది.

బ్రాండెడ్ మందులతో పోలిస్తే కొన్ని జెనరిక్ మందులు 80 నుండి 90% వరకు తక్కువ ధరలో లభిస్తున్నాయి. రోగాలకు వైద్యులు కంపెనీ పేర్లను సూచించకుండా జెనరిక్ పేర్లు వ్రాసి ఇవ్వాలని భారతీయ వైద్యమండలి మార్గదర్శకాలు చెప్తున్నాయి. మందుల చీటీలో వైద్యులు జెనరిక్ పేరే రాయలని సుప్రీం కోర్టూ గతంలో సూచించింది. జెనరిక్ మందుల వినియోగం పెరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాలనికి ఢిల్లీ హైకోర్టు సూచించడమూ పాత సంగతే.

లక్ష కోట్ల రూపాయల మన ఔషధ విపణిలో 70% జెనరిక్‌దే. వాటిని విదేశాలకు ఎగుమతి చేసి లాభాల నార్చిస్తున్న మన ఔషధ తయారీ రంగం దేశీయంగా వాటి వాడకాన్ని తగినంత ప్రోత్సాహించకపోవడం శోచనీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here