గులాబీ

0
3

[dropcap]త[/dropcap]నువంతా ఎర్రదనం నింపుకొని
మృదువైన రేకులు కప్పుకొని
సుగంధం వెదజల్లుతోంది
దూరాన ఉన్న ఆ గులాబీ పువ్వు

ఓసారి తాకుతానని చేయి వేస్తే
గుచ్చుకుంది ముల్లు నొచ్చుకుంది పువ్వు
చేతినుండి అదే ఎర్రని రంగు రక్తం
జర జరా కారింది, పూరేకుల నుండి
హిమబిందువులేమో రాలాయి కొన్ని

అవి పుష్పాశ్రువులా…రోదిస్తుందా ఆ విరి
ఇంత సొగసున్న తనకి అస్పృశ్యత అని
ఇది ఓ గులాబీ విలాపము

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here