[dropcap]అ[/dropcap]క్కడ నాకు నేనే
ఇక్కడ నా జీవితం
చక్కటి తాజాదనంతో
నేల వాసన వేరు అక్కడ
అది నా వాసనే అనిపించేది అందరికీ
అక్కడి జ్ఞాపకాల వాసనే ఇక్కడ అంతా
గుర్తు చేసుకునేది ఎపుడూ
నిన్నటి రోజునే అక్కడ
లేవాల్సి వస్తున్న ప్రతీ వేకువతో
గుర్తు చేసుకునేది ఎపుడూ
గడపాల్సిన రోజునే ఇక్కడ
నేను ఎక్కడున్నట్టు
అక్కడా ఇక్కడా?