కొత్త పదసంచిక-10

0
3

‘కొత్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. నా డొనేషన్ తో ఏర్పడిన గ్రౌండు.(4).
04. వ్యూహము చివరకు వేడెక్కినట్టుంది. (4).
07. సరళముగా వ్రాయమంటే జడ చేర్చారా లోపల!(5).
08. చందమామ లో చిత్రకారుడు.(2).
10. చెప్పి వచ్చిన యుద్ధము.(2).
11. గుడి లేని పండుగ తిరగబడింది.(3).
13. రాక్షస దేశానికి గౌరవము కూడానా!(3).
14. మొదలు లేకుండా అయింది కొసకు.(3).
15. కాళిదాసు ఇష్టపడేది.(3).
16. మీరలా ఉల్టా కోపం ప్రదర్శిస్తే ఎలా?(3).
18. జాషువా గారి భస్మ సింహాసనం.(2).
21. వెనుక నుంచి మండు.2).
22. క్రియా విశేషణాదులు.(5).
24. కారా మాస్టారి గ్రామం.(4).
25. అతను మేము కుదుర్చుకున్న ప్లీడరు (4).

నిలువు:

01. నేను ఫలానా వాని సేవకుణ్ణి అంటాడు మత్సవల్లభుడు.(4).
02. కొండంత ఆభరణమా?(2).
03. ఊర్ధ్వ మూలః అధశ్శాఖః, ఏకః వృక్ష విశేషః అస్తి!(3).
04. ఇది పెట్టడం అంటే ప్రారంభించినట్టే!(3).
05. ఆమ్రేడిస్తే త్వరగా అవుతుంది.(2).
06. క్రింద నుండి రండి. మధ్యలో నిష్ఠ ప్రదర్శించినా అల్పమే!(4).
09. పార్వతీ నందనుని మాతృమూర్తి ప్రాణ నాథుడు.(5).
10. భాషకు శోభ కూర్చేవి.(5).
12. గొప్పదైన చెయ్యి.(3).
15. మీరు యుక్తము అంటే చాలు! ధర చెల్లించనక్కర లేదు.(4).
17. కలతలు కాకులలా వెంటతరుముతున్నాయి. (5).
19. వ్యాధి నయమవ్వాలంటే ఈ రసాయనం తల క్రిందులుగా తాగాలా?(3).
20. హిందీ వాళ్ళ కోలాహలంలో వస్తాదుని చూడండి. (3).
22. మోడీ గారి పార్టీకి మధ్యలౌ మూడింది.(2)
23. వెల మొదట్లోనే లేదు. ఇప్పుడు చింతించి ఏమి లాభం? (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 అక్టోబరు 11 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 10 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 అక్టోబరు 17 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-8 జవాబులు:

అడ్డం:   

1.విరితావి 4. సడేమియా 7. తాజమహలు 8. రానె 10. తెము  11. జలజ  13. పులులు 14. బొందిలో 15. గడియ  16. ర్ణంపూసం  18. గుమి 21. లుకీ 22. భాగ్యనగరం 24. టుడబాత 25. సంభవము

నిలువు:

1.విఘ్నరాజ 2. తాతా  3. విజను  4. సహనం 5. డేలు 6. యాగములు 9. నెలనడిమి  10. తెలుగు పూలు 12. ఇందిర 15. గగుర్పాటు 17. సంకీర్ణము 19. యోగ్యత 20. మంగసం 22. భాబా 23. రంభ

కొత్త పదసంచిక-8 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • ముద్దు అన్నపూర్ణ
  • నీరజ కరణం
  • పి.వి.ఆర్. మూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here