సందిగ్ధ సంధ్య

0
3

[dropcap]తొ[/dropcap]లిపొద్దుల్ల భూపాలరాగాన్ని..
ఎక్కడ , ఎప్పుడు వినడం
మానేశానో యాదిలేదబ్బా!!

వెతుక్కుంటూ వెనక్కిపోయా…
కోడికూతకు కళ్ళువిప్పి,
వేపచెట్టు కింద పరుగులెట్టి,
మీగడ పెరుగు చల్ది తిని,
పలకతో పరుగెత్తుకు బడికి
పోయేప్పుడు చెవులను తాకిన
సముద్రపు గాలి రాగం ఏదో అస్పష్టంగా గుర్తొస్తోంది.

కాలంతో సంబంధం లేకుండా…
మెరుపు చుక్కల నల్లచీరె కట్టుకునే
ఆకాశ పందిరి కింద .. పడుకున్నప్పుడు…
ఉన్నట్టుండి చక్కిలిగింతలు పెట్టే..
పైరగాలి సమ్మోహనగీతం
లీలగా గుర్తుంది.

ఇరుసంధ్యల్లో కదలాడే ఎద…
ఊసులెప్పుడు మరచిందో..?
ఇపుడన్నీ అసుర సంధ్యలే!

పరుగుల్లో పడి ప్రకృతికి చాలా దూరంగా వచ్చేశాను…
చింతలే తప్ప చిగురు లేని జీవితమిప్పుడు,
టార్గెట్లతో కదిలే కంటికి, మనసుకు
మెలకువ వచ్చిన క్షణం అంతా..
సందిగ్దమే…ఏ సంధ్యో తెలియనితనంతో …,
యాంత్రికతతో ఏదోలా …
లౌల్యంతో బతికేస్తూ…
తెరల మధ్య చిత్రంగా కదులుతున్నా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here