[dropcap]జీ[/dropcap]వరాశులలో జవం లేని రాశి
అతడే మధ్యతరగతి మనిషి
అసలు మనిషో కాదో తెలియదు
మనసు మాత్రం ఒకటుందట
కలవారితో కలవనివ్వరు
లేనివారితో ఉండలేడు
అటూ ఇటూ కాని వింతజీవి
చింతలు సొంతమైన బడుగు జీవి
ఇంట్లో పెళ్ళాం పోరు జోరెక్కువ
పిల్లలకి సరదాల ఊసెక్కువ
జేబులో కరెన్సి నోట్లే ఉండవు
అప్పులు మాత్రం కుప్పల తెప్పలు
ఫస్టు కోసం రోజూ ఎదురు చూపే
ఆ ఫస్టు కాస్తా రన్నింగు రేసులో
ఎపుడూ ఫస్టొస్తుంది, తుర్రుమంటుంది
మొదటి వారం అయితే చాలు
కథ మొదటికి మళ్ళా వస్తుంది
ఇంట్లో కూర్చొని ఏడవలేడు
బయటకెళ్తే ముఖమెత్తుకో లేడు
తల దించుకుంటే కనిపించేది
భూమి కాదు చుక్కలు
కంట రాలే కన్నీటి చుక్కలు
ఇదండీ మన మధ్యతరగతి
అధోగతి పోయి వచ్చేనా ఉన్నతి