[box type=’note’ fontsize=’16’] విజయదశమి పండుగ సందర్భంగా శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘రా… దసరా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]వ[/dropcap]చ్చింది వచ్చింది దసరా
తెచ్చింది మంచికి ఆసరా
చెడుపై మంచికి గెలుపు
నవరాత్రులతో నవ జవం ఇచ్చి
నవ జీవనానికి నాంది పలికింది
ముష్కర రక్కసుల వధ
జరిగింది యుగాల వెనుక
నేడు జరగాల్సింది మాత్రం
నరుల ముసుగులు వేసుకొని
పరులను పరి విధముల పీడిస్తూ
స్వార్థం మోసం ద్రోహాలతో
నయవంచన చేయు నయా రక్కసులను
తరిమి కొట్టండి తురిమి వేయండి
ఈ నవరాత్రులను నవ చైతన్యంగా
గడపండి దుర్గాదేవిని పూజించి
చండీ కరుణను పొందండి తరించండి