‘విశాఖ సాహితి’ స్వర్ణోత్సవాలలో భాగంగా, శరన్నవరాత్రుల సందర్భంగా 7-10-2021 నుండి 15-102021 వరకు ‘శ్రీ దేవీ నవరాత్ర ప్రసంగ లహరి’ కార్యక్రమాలు అంతర్జాల మాధ్యమంలో జరిగినవి.
సభలకు అధ్యక్షత వహించిన ‘విశాఖ సాహితి’ అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు, గతంలో కూడా విశాఖ సాహితి ఆధ్వర్యంలో శ్రీ దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితా పీఠంలో ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమాలు విశాఖపట్టణంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.
ఈ ప్రసంగ కార్యక్రమాలలో మహామహోపాధ్యయ ఆచార్య శలాక రఘునాథశర్మ, ఆచార్య సార్వభౌమ, ఆచార్య వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆచార్య వేదుల సూర్యాకాంతం, ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, డా. టి.వి. నారాయణ రావు, విద్వద్వరేణ్యులు శ్రీ కాశీభొట్ల సత్యనారాయణ, డా. శ్రీమతి మల్లాప్రగడ శ్రీదేవి, పద్యకళా తపస్వి ఆచార్య ధూళిపాళ మహాదేవ మణి గారలు తమ ప్రసంగాలతో అందరినీ అలరించారు.
దేశ విదేశాల నుండి పండితులు, శ్రధ్ధాళువులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభలకు విశాఖ సాహితి కార్యదర్శి – సమన్వయకర్తగా వ్యవహరించగా, ఈ ప్రసంగాలను ‘నానీస్ మహతీ ఛానెల్’ ద్వారా యూట్యూబ్‍లో ప్రత్యక్ష ప్రసారానికి శ్రీ నిష్ఠల నరసింహం గారు ఏర్పాటు చేశారు.