అసాధ్యుడు (మొగ్గలు) – పుస్తక పరిచయం

0
3

[dropcap]ద[/dropcap]క్షిణ భారతదేశం నుండి దేశానికి ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి శ్రీ పి.వి.నరసింహారావు. ఆయన తెలుగువారు అవడం గర్వకారణం. ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా ఆయనను గౌరవించుకుంటూ మొగ్గలు ప్రక్రియలో ఆయనపై కవితలు వెలయించారు డా. భీంపల్లి శ్రీకాంత్.

~

“కథా రచయితగా, నవలా రచయితగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా విభిన్నమైన రచనలు చేసిన పి.వి. విలక్షణమైన రచయితగా వినుతికెక్కాడు. అలాంటి సాహితీ దురంధరుడి శతజయంతిని పురస్కరించుకుని చంద్రుడికో నూలుపోగులా పి.వి. రాజనీతిజ్ఞతను, సాహిత్య సేవను అసాధ్యుడు పేరుతో మొగ్గల ప్రక్రియలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. పివి గురించి ఎంత రాసినా తక్కువే. ఎంత చదివినా తక్కువే” అని వ్యాఖ్యానించారు కవి డా. భీంపల్లి శ్రీకాంత్ తన ముందుమాట అసాధారణ పాండిత్యం పివి సొంతం‘లో.

~

“డా. భీంపల్లి శ్రీకాంత్ శతాధిక మొగ్గలలో పి.వి. నరసింహారావు ఔన్నత్యాన్ని, ఆదర్శవంతమైన జీవితాన్ని, సాహిత్య సేవను, రాజనీతి తంత్రాలను, భిన్న భాషలలో అతనికున్న పటుస్వాన్ని, భారతదేశంలో అతను ప్రవేశపెట్టిన ఆర్థిక, భూ సంస్కరణలు, తొలి తెలుగు భారత ప్రధానిగా సమర్థవంతమైన పరిపాలన విధానాన్ని తెలిపాడు” అని తన ముందుమాట ‘పి.వి. స్మరణలో పూసిన మొగ్గలు‘లో పేరొన్నారు బోల యాదయ్య.

~

జీవితంలో తొలి ఉద్యమప్రస్థానానికి శ్రీకారం చుట్టి
వందేమాతర ఉద్యమంతో వేకువకిరణమై వెలిగిండు
పివి పోరాటానికి పాదులువేసింది వందేమాతరోద్యమం
~
మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని సంకల్పించి
తెలుగు అకాడమిని స్థాపించిన అసలైన భాషాభిమాని
అధికారిక మాతృభాష విద్యావిధాయక రూపకర్త పివి
~
సరళీకృత ఆర్థిక విధానాలకు అంకురార్పణ చేసి
బలోపేతమైన వ్యవస్థాకృతికి పాదులు వేసినవాడు
భారతదేశ ఆర్థిక ఉద్యమానికి స్ఫూర్తిప్రదాత పివి
~
రాజకీయజీవితంలో ఆటుపోట్లనెన్నింటినో ఎదుర్కొని
తలపండిన మేధావిగా ప్రకాశించిన అసామాన్యుడు
సమయస్ఫూర్తితో నెగ్గుకొచ్చిన సహనశీలి మన పివి
~
కలసిరాని కాలంలో సమస్యలతో నిత్యపోరాటం చేసి
దేశ విజయపతాకను ఎగురవేసిన అపరచాణక్యుడు
ప్రజాస్వామ్య చరితకు అసలైన చిరునామా పివి
~
ఉన్నతమైన రాజకీయ పదవులలో ఒదిగి ఎదుగుతూనే
పాలనాపరమైన చైతన్యాన్ని రగిలించిన కార్యదక్షుడు
అలంకరించిన పదవులకే వన్నెతెచ్చిన రాజనీతిజ్ఞుడు పివి
~

ఇలా పి.వి. నరసింహారావు గారి గొప్పతనాన్ని చాటే మొగ్గలు ఈ పుస్తకంలో మరిన్ని ఉన్నాయి.

***

అసాధ్యుడు (మొగ్గలు)
రచన: డా. భీంపల్లి శ్రీకాంత్
ప్రచురణ: పాలమూరు సాహితి
పేజీలు: (8+32) 40
వెల: ₹30
ప్రతులకు:
డా. భీంపల్లి శ్రీకాంత్,
ఇం.నెం. 8-5-38, టీచర్స్ కాలనీ,
మహబూబ్‌నగర్
ఫోన్: 9032844017
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here