[dropcap]నీ [/dropcap]కన్నులు.. చేపపిల్లలై
ఈదుతున్నాయి … నా మనసులో
నీ చూపులు… ఇంద్రధనువులై
వెలుస్తున్నాయి…నా మదిలో
నీ పెదవులు…రతి గుళికలై
నీ పైఎదలు…రతి చినుకులై
నీ వంపులు…రస కులుకులై
గువ్వలు చేసే సవ్వడి లా
వలపుల పంపే అలజడి లా
మురిసిన ఎదలో ప్రేమ సడి లా
పై పరువపు సొగసుల ఝరి లా
వంపుల వయ్యారాలు ఆవిరిలై
కవ్విస్తున్నాయి
కలవరపెడుతున్నాయి నన్ను
నిను వదలని ప్రేమ
ప్రణయ విహరం చేస్తుంది
కాదంటావా… చెప్పు