[dropcap]ఒ[/dropcap]క్కడు లేడు
తెల్లగా… తీయగా
చల్లగా… చలువగా
మెత్తని గోతులు తవ్వి
నల్లని నవ్వులు రువ్వి
మౌనం ముసుగును దాల్చి
జిత్తుల మాటల్ని చల్లి
నమ్మకం తొడుగులో
మురిపిస్తున్నాడు లోకాన్ని
జీవిస్తున్నాడు లోతుగా
నటిస్తున్నాడు మనిషిగా
అవకాశవాదం చాటుగా
పేరాశను పదునుపెట్టి
వదిలే బాణాలను
పుటకలోనే భుజాన దాచి
అన్యాయంగా కొట్టి
ఆధర్మంగా చంపి
నిర్దాక్షిణ్యంగా చీల్చి
కర్కశంగా తినే
రాక్షసబలమే
మెచ్చే కీర్తి
నచ్చే నీతి
చంపే రీతి
బలవంతంగా లాక్కొని
బలహీనులను పీడించి
కండబలంతో గద్దించి
అండబలంతో పీక్కోని
అనుభవించే బలగమే
అదృష్టమనుకొని ఆనందం
సంబరపడే సంతోషమే
సుందరమైన ప్రపంచం.
ఒక్కడు లేడు
తృప్తిగా…. తేటగా
పచ్చగా… ప్రేమగా