[dropcap]న[/dropcap]వంబర్ 8న హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి తిరుపతి కథా రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజుకు రావూరి భరద్వాజ ప్రతిభా పురస్కారం అందించారు.
కథా రచనలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సహకంగా రావూరి భరద్వాజ కుమారుడు వెంకట కోటేశ్వరరావు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు.
జి వి ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుదిబండి వెంకట రెడ్డి, సాహితీ ప్రియులు చిల్లా రాజశేఖరరెడ్డి, ఎం.అరుణ కుమారి, ఓదెల జ్ఞానేశ్వర్,ఇతర కళాకారులు పాల్గొన్నారు.