[dropcap]న[/dropcap]న్ను ఆపేసి
ఆగితే నీకు
దొరికే ఆనందం ఏమిటి?
నన్ను నెట్టి
పడిపోతే నేను
పొందే సంతోషం ఎక్కువా?
నన్ను కాదని
దూరమై నీవు
సాధించే విజయం సుఖమా?
నన్ను చేరుకొని
తలచుకునే
పొందే దగ్గర దుఖఃమా?
కాదన్న ‘కల’ ఎప్పుడూ
లేదన్నా బంధమే.
వద్దన్నా విలువే.
నాకు లేకుండా
నీది కాకుండా
‘మనం’ కాకుండా పోములే.