కొత్త పదసంచిక-18

0
3

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. బాణసంచాల భవుని పట్టణం.(4).
04. కొండంత ఏనుగు ని కంట్రోల్ చేసేవాడు. (4).
07. అస్తవ్యస్తంగా తిరుగుతుంది కాబోలు ఈ మార్జాలం. (5).
08. తీలేని రోటీని తిరగేయండి. (2).
10. సూర్యుడు పడమరన ఉదయించాడా?(2).
11. సొగసైన శివపత్ని. (3).
13. విరాటపర్వం తో మొదలెట్టమంటే అంతా అస్తవ్యస్తం చేసేశారా? (3).
14. చెన్నై లో ఉంది. వెళ్లి చూసి రండి. (3).
15. అదిలాబాద్ జిల్లా సదాశివుని ఇంటిపేరు. (3).
16. వెఱ్ఱివాడైన రాజ్ కపూర్. (3).
18. విలువలు సగం అంతరించిపోయాయి కదండీ. (2).
21. భార్యాభర్తల లో సగం! (2).
22. ఎరువుల వాడకం వలన వచ్చేది. (5).
24. Ag. అంటే వ్యవసాయ సంబంధించిన విషయం కాదు!(4).
25. పాకిస్థాన్ క్రికెటర్ మాజీ భార్య అయిన మన నటిని తత్సమం చేయండి.(4).

నిలువు:

01. ఈ వధ మాఘ మాసం లో చేసినదా?(4).
02. అంకుల్! అది అవకాశ వాద పొగడ్త!(2).
03. క్రైస్తవుడని సుళువుగా గుర్తించ గల సాధనం!(3).
04. విరాటపర్వం లో కృష్ణ!(3).
05. సరే కానీ, తోట చివరనేం చేశారో చెప్తారా? (2).
06. బరువు మోయలేక తిరగబడ్డాడు.(4).
09. ఇవి నూటొక్క జిల్లాల అందగాడికి ప్రాచుర్యం చేకూర్చి పెట్టేయి. (5).
10. ఎడ్డెమంటే తెడ్డెమనే వివాదపు తండ!(5).
12. పందిలో దాగిన పాండవమధ్యముడు.(3).
15. భానుమతి విరహంతో తడబడ్డారు చివరకు. (4).
17. తాండూరు దీనికి ప్రసిద్ధి. (4).
19. కనుమ నాడు తింటాం.(3).
20. ఇక్కడ పనులూ జరుగుతాయి, పాటలూ కొనసాగుతాయి. (3).
22. చేతి పనులు చివరకు అంతరించిపోయాయి. (3).
23.  పడవ బోల్తా కొట్టింది.(2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 డిసెంబర్ 06 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 18 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 డిసెంబర్ 12 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-16 జవాబులు:

అడ్డం:   

1.విశ్వంభర 4.దుకూలము 7.తుచతప్పక 8.పస 10.చిట 11.నమాజు 13.అన్నలు 14.మీరటు 15.విరహం 16.రౌరవ 18.నోము 21.హాసం 22.అంఘ్రిభవుడు 24.నితంబిని 25.లుడువుము

నిలువు:

1.విజ్ఞాపన 2.భతు 3.రచన 4.దుప్పటి 5.కూక 6.ముచ్చటలు 9.సమాచారము 10.చిన్నతరహా 12.మరణం 15.వినోదిని 17.వసంతము 19.అంఘ్రిని 20.బ్రేవులు 22.అంబి 23.డుడు

కొత్త పదసంచిక-16 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావన రావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శిష్ట్లా అనిత
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here