[dropcap]ప్ర[/dropcap]కృతి ఎంతో రమణీయం
ప్రపంచమింకా సుందరం
ప్రేమించడమే నేర్చుకో
బాధను నువ్వు ఓర్చుకో ॥ప్రకృతి॥
నలుగురితో కలవడం, కలివిడిగా తిరగడం
ఉన్నదికాస్త పంచడం, తృప్తిని నువ్వు పొందడం
నరనరాన జీర్ణించుకో
నరునిగా జేజేలందుకో ॥ప్రకృతి॥
.
మంచినే చూడటం, చెడునే విడనాడటం
చిరునవ్వుని చిందించడం, చిరుబురులాడుట మానడం
చెలిమినే పెంచడం, కలిమిగా భావించడం
విధిగా నువ్వు మార్చుకో, నిధిగా దాన్ని చూసుకో ॥ప్రకృతి॥
ఈర్ష్యను దూరం చేయడం, ప్రతిభకు పట్టం కట్టడం
సానుభూతి చూపడం, సాయం కాస్త చేయడం
మనిషిగా నువ్వు మసలుకో
మనీషివై ఇక వెలిగిపో! ॥ప్రకృతి॥