వగ

3
3

[dropcap]”దే[/dropcap]వుడు అందరిలాను వుండాడంటారు, ఇది నిజమా రామన్నా” అంటా అడిగితిని.

“నిజంరా” అనె అన్న.

“అట్లయితే జనాలంతా ఒగర్ని ఒగరు తిట్టుకొంటా, కొట్టుకొంటా వుంటే ఏల అడ్డమేస్తా లేదు” తిరగా అంట్ని.

“ఆయప్ప వుండేది అడ్డమేసేకి కాదురా” అట్లే అనె.

“ఇంగేమిటికినా?” ఇట్లే అడిగితిని.

“అదేమిటికని నువ్వే తెలుసుకొనాలరా!”

“నాకి అంత వగ వున్నింటే నిన్ని ఏమిటికి అడిగింట్నునా?”

“అట్లంటావారా”

“ఊనా”

“రేయ్! నీ అంత నిజంగా చెప్పతా వుండా, నేను నీకన్నా వగ లేని వాన్నిరా. నువ్వు నన్ని అడిగితే ఎట్లరా?”

“నిన్ని ఏమి చేసేది”

“నన్ని ఏమి చేస్తావు కాని అది ఎవురో ఏమో అంటా వుండారని అంటివి కదా, వాళ్ళని ఏమైనా చేస్కోపో… అయినా ఇట్ల అనేవాళ్లే తిరగా మాట మార్చి దేవుడు ఒగడే అంటారు. ఆ దేవుని ఏకాకి చేసారు”

“మడి (మరి) ఇబుడు ఎట్లనా?”

“ఎట్లాలే గిట్లాలే. శూన్యం శూన్యంతో చేరి శూన్యమైంది”

“అంటేనా?”

“౦-౦=౦”

“నాకి అర్థం కాలేదునా”

“నాకి మాత్రం అర్థమైదారా, నా బుర్రకు తట్టింది నేను అంట్నిరా. అయినా మనిషి భుమ్మింద అన్ని జీవుల కన్నా తెలివైన వాడే కాని అనంతాన్ని అర్థం చేసుకునేంత అర్థవంతమైన వాడు కాదేమో అని నాకి అనిపిస్తుందిరా”

“అంటే! ఆ అర్థం కత అంతేనంటావానా?”

“ఏమోరా! అర్థం అయిన వాళ్ళు ఎవరైనా వుంటే వాళ్లే చెప్పాల”.

***

వగ = యోగ్యత

~

దండాలు:

5-1-2020 నుండి 5-12-2021 వరకు ప్రతి ఆదివారం నా కథలను (101 కథలను) ప్రచురించిన సంచిక వెబ్ పత్రికకు, సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారికి, వారి కార్యవర్గానికి… నా ప్రతి కథని చదివి తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసిన పాఠకులకు దండాలు తెలియజేస్తున్నాను. మళ్లీ కలుద్దాం!

ఇట్లు

అగరం వసంత్

హోసూరు, తమిళనాడు

9488330209

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here