కలగంటినే చెలీ-24

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

క్లైమాక్స్‌:

[dropcap]పో[/dropcap]లీస్‌స్టేషన్‌లో.. ఎస్సై సమక్షంలో ఉన్నారు సూర్య, సీత, రాజు, రోహిణి!!

“ఆ… చెప్పండమ్మా..” అంటూ ఆసక్తిగా ముందుకి వంగాడు ఎస్సై.

“సార్‌.. మీకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్‌” అంది రోహిణి

“ఇంతకీ మీరెవరూ” అన్నాడు ఎస్సై.

“నా పేరు రోహిణి సార్‌.. సూర్యకు, శేఖర్‌కు కొలీగ్‌ని.. ఆ రోజు శేఖర్‌ బర్త్‌డే పార్టీకి నేను కూడా వెళ్ళాను..” అని ఆగింది.

“వాట్‌… మీరు కూడా వెళ్ళారా..” అని ఆశ్చర్యపోయి “..అయితే ఏం జరిగిందో చెప్పండి” అన్నాడు ఎస్సై.

రోహిణి జరిగింది చెప్పింది. ఎస్సై సాలోచనగా వెనక్కు వాలి “ఆహా…. ఆ శేఖర్‌గాడు ఇదంతా ఆడించాడన్న మాట. అయినా అలాంటి వాడితో నీకు ప్రేమా గీమా ఎందుకమ్మా.. వాడు పిలిస్తే ఎగేసుకుంటూ వాడి రూముకి వెళ్ళిపోవడమేనా” అన్నాడు ఎస్సై.

రోహిణి తప్పుచేసినట్టు తలవంచుకుంది.

“…సరే మా స్టైల్‌లో ఇంటరాగేట్‌ చేస్తాం.. అన్ని నిజాలు వాడే కక్కుతాడు.. ఇక మీరు నిశ్చింతగా వెళ్ళండి” అని చెప్పాడు ఎస్సై.

సూర్య రెండు చేతులు జోడించి “చాలా ధన్యవాదాలు సార్‌..” అన్నాడు.

సీత “సార్‌.. మీలాంటి వారి వల్లే పోలీసులకి మరింత వన్నె పెరుగుతోంది.. చాలా థేంక్స్‌ సార్‌..” అని కృతజ్ఞతా భావంతో చూసింది.

“ఇట్స్‌ ఓకే అమ్మా.. నేను అన్నీ చూసుకుంటాను.. మీరు వెళ్ళి రండి” అని నవ్వేసి రోహిణి వైపు చూస్తూ “అవసరమైతే పిలుస్తాను.. వెంటనే రావాలి” అన్నాడు ఎస్సై.

“డెఫినిట్లీ సార్‌.. ఇట్స్‌ మై ప్లెజర్‌..” అని చెప్పింది రోహిణి.

తర్వాత అందరూ అక్కడినుండి బయటపడి ఇంటికి వచ్చేసారు.

కొన్ని రోజుల తర్వాత …

పోలీసుల ట్రీట్‌మెంట్‌కి లొంగి శేఖర్‌ ‘హత్యా నేరాన్ని’ ఒప్పుకున్నాడు. రోహిణి ఇచ్చిన సాక్ష్యం కూడా అందుకు సహకరించింది.

ఆ విధంగా సూర్య హత్యా నేరం నుండి బయటపడ్డాడు.

భగవంతుడి దయ వల్ల అతని జీవితంలో కమ్ముకున్న మబ్బులు విడిపోయాయి. చీకటి పోయి వెలుగు వచ్చింది. సీత అతని మనస్తత్వాన్ని, ఆశలను అర్థం చేసుకుంది. సూర్య తన తల్లిదండ్రులను కొన్ని రోజులు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాక వాళ్ళ వైపు చూడాలని అనుకున్నాడు. సీత అయితే తమ తల్లిదండ్రులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నిర్ణయించుకుంది.

సూర్య.. సీత.. చింటూ.. ముగ్గురూ తమదైన ప్రపంచంలో ఉంటూ.. తమ కష్టాలని… సుఖాలని.. అన్నిటినీ అనుభవిస్తూ ‘మేడంటే మేడా కాదూ.. గూడంటే గూడూ కాదూ.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది’ అని పాడుకోవాలని గాట్టిగా నిర్ణయించేసుకున్నారు మరి.

జీవిత భాగస్వామితో ప్రేమ లోకాల్లో విహరించాలని విద్యార్థి దశలో కలలు గన్న సూర్య, అప్పటికే ఆ లోకపు ముఖ ద్వారాన్ని దాటి లోపలి వీధుల్లోకి వెళ్ళిపోయాడు. సీత అతన్ని మురిపెంగా చూడసాగింది. చింటూ కిల కిలా నవ్వుతున్నాడు.

సర్వేజనా సుఖినోభవంతు!!!!

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here