[dropcap]మ[/dropcap]రణం అనివార్యం
జన్మించిన ప్రతి జీవికి
మరైతే ఏదీ
మరణం చిరునామా
జననమైన వీలునామానే
గగనంలోనో భువనంలోనో
నడిచే చుక్కలాగనో
నీడైన మొక్కలాగనో
మరణం అంటే
నడిచే పార్థివదేహం
మరలాంటి జీవిలో మరలాగే
కదిలిపోయేను భౌతిక రూపం
ఆపలేవులే మరణాన్ని
సిరులెన్ని ఉన్నా
నిలుచునా శాశ్వతం
బంధుస్నేహ విరులెన్నున్నా
తప్పదు మనిషికి మృత్యువుశ్వాస
బహుశా సృజన కవికీ
సాహిత్య రవికీ లేదేమో మరణం
అక్షరాలు కావ్యాలుగా
సినీ సిరి గీతాలుగా
ఒక పగలే వెన్నెలలా
సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సినీ వినీలాకాశంలో కవిత్వమైన విపంచిగా
ప్రకాశమై విస్తరించు ఈ మట్టిలో చెట్టులా జీవించేను అమరులై..
కావ్య కవన పొలంలో శ్వాసిస్తూ