ప్రణయ మురళి

0
3

[dropcap]ప[/dropcap]లికించవా ప్రణయ మురళి
వినిపించవా మధుర రవళి
వికసించును లతాంతాలు
వెల్లివిరియు వసంతాలు
కృష్ణా! యదునందనా! ॥ పలికించవా ॥

విరహాగ్నిలో వేగే
రాధ మనసు మురిసేలా!
వలపుధారలే కురిసి
ఆమె తనువు తడిసేలా! ॥ పలికించవా ॥

యమునా నీటిజాలులో
అలలన్నీ అలరేలా!
అందాల బృందావనిలో
విరులన్నీ విరిసేలా! ॥ పలికించవా ॥

వ్యాకులంలేని గోకులంలో
గుండెలు పులకించేలా
గోప్యం లేని గోపికలందరు
పరవశించి ఆడేలా ॥ పలికించవా॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here