[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
పెమ్మరాజు అశ్విని
[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం.
నా పేరు పెమ్మరాజు అశ్విని, వృత్తి రీత్యా అకౌంటెంట్‌ని కాకపోతే చిన్ననాటి నుండి తెలుగు భాషకు మమ్మల్ని సాధ్యమైనంత దగ్గరగా పెంచారు మా అమ్మగారు, అందువల్ల తెలుగు సాహిత్యం మీద మక్కువ అలవడింది. అలా చదువుతూ ఉండగా మన ఆలోచనలకు ఎందుకు అక్షర రూపం ఇవ్వకూడదు అనే ఆలోచనతోనే అలవర్చుకున్న ప్రవృత్తి రచనలు చెయ్యడం.
మన చుట్టూ వున్న సమాజంలో జరిగే ఏదైనా ఒక అంశం మనుషుల మీద దాని ప్రభావం గురించి విశ్లేషించడం, ఆ పాత్రల ద్వారా తోచిన పరిష్కారం చెప్పించే ప్రయత్నం చేస్తుంటా.
ఆ క్రమంలో భాగంగా నేను చెప్పదల్చుకున్న విషయాన్ని బాపు రమణ గార్ల ప్రేరణతో మన తెలుగింటి జంట రాధగోపాళం ద్వారా ‘రాధమ్మ ముచ్చట్లు’ అనే శీర్షికతో ప్రతి ఆదివారం ఫేస్‌బుక్ మాధ్యమంగా అందిచగా దానికి చక్కటి ఆదరణ లభించడంతో, అచ్చంగా తెలుగు వారి సౌజన్యంతో ‘రాధమ్మ ముచ్చట్లు’ పుస్తక రూపం దాల్చింది.