తరలిపోయిన పాటల వసంతం

0
4

[dropcap]ప[/dropcap]దాల వనంలో సంచరిస్తూ
వాక్యాల పల్లవులతో
విరాజిల్లిన వెన్నెలతడు
అల్లికల్లోని మెలకువలతో
భావాల సుగంధాలతో
హృదయాలను గెలుచుకున్న
పాటల రేడు అతడు..!

మనోవేదన వంటి
అగ్ని సరస్సులోంచి
వైవిధ్యభరితమైన పాటలెన్నో
ఉప్పొంగి అలరించినవి
తొలి వలపుల ప్రణయపు రాగాలను
అలవోకగా అక్షరీకరించిన
నవరసాల విజ్ఞాన గని అతడు..!

స్నేహపు మాధుర్యాల సరిగమలను
తడుముకోకుండ రాయగల సవ్యసాచి
జగమంతా మానవీయ సుమాలు
వికసించాలని కలలు కన్న స్వాప్నికుడు
నిరాశలో కూరుకుపోతున్న వాళ్లందరికీ
ఆశల కిరణాల మార్గాన్ని బహూకరించిన
సుమనస్కుడైన సౌజన్య మూర్తి అతడు…!

తానేంతగానో తల్లడిల్లోక గేయమై
మనల్ని అల్లుకుంటేనే కదా
మన కంట్లో నుండి కన్నీరు కారింది
తానోక పదును పెట్టిన ఆయుధమై
మనల్ని అలుముకుంటేనే కదా
నిర్భయంగా అడుగులు వేసింది
మన దగ్గరికి ఆత్మీయమైన అతిథిలా వచ్చి
మనల్ని దుఃఖ సాగరంలో వదిలివేస
తాను మాత్రం దివికి తరలి పోయిన
పాటల వసంతమయ్యాడు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here