[dropcap]వ[/dropcap]లపు వల వేసి
చూపుల బాణాలతో పడేసి
మాయల మాటల మంత్రమేసి
కవ్వింపుల ధూపమేసి
కన్నె చెఱువుతో మంటేసి
పై పరువపు తూటాలతో కాల్చేసి
వంపుల కొలిమిన ముంచేసి
విరుపుల వియోగంలో కట్టేసి
సరసాసాల కౌగిలిలో బంధీచేసి
సుఖమయ తీరాన
ఒంటరిగా వదిలేయక
ననూ….నీతో తీసుకుపో
అపురూప అమరత్వం
పంచుకొని… బ్రతుదాం
జీవిత ఆసాంతం
ప్రేమ వసంత వనాన
ప్రణయ తపస్సులో…