ముద్దుల నానీలు-1
1.
[dropcap]స[/dropcap]ముద్ర అలలు
తీరాన్ని ముద్దాడె
ఆ అలల్ని చేపలు
ముద్దాడె
2.
చల్లగాలి
మేఘాలను ముద్దాడె
మేఘం
ఆనందభాష్పాలు రాల్చె
3.
పురుగు పుట్ర
ముద్దాడుకున్నాయి
ఏమి సాధించాయో
ఎవరికెరుక
4.
సిమెంట్, ఇసుక
ముద్దాడాయి
ఇరవై నాలుగంటల్లో
బంధం దృఢమైంది
5.
మాస్క్
ముక్కూ నోరును ముద్దాడింది
కరోనాను
అడ్డుకుందిగా మరి
6.
ముద్దులో
మునిగి తేలాయి నానీలు
నవ్వులో మునిగి తేలాలి
చదువరి
7.
పూలను
ముద్దాడె తుమ్మెదలు
సంతాన ప్రాప్తి చెందె
తరువులకు
8.
గాలి
శిలలను ముద్దాడె
మరి శిలలకు
సంతాన ప్రాప్తి కలిగేనా?
9.
వాహనం
రోడ్డును ముద్దాడె
రోడ్డుకు దిమ్మతిరిగి
దుమ్ము లేపె