[dropcap]ప[/dropcap]ల్లవి:
అమరజీవి, ఓ….. అమరజీవి
ఆంధ్రుల హృదయాలలో చిరంజీవి
ఆశయ సాధనకు ఆత్మార్పణ చేసిన త్యాగశీలి
ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేర్చిన ధీశాలి ॥ అమరజీవి॥
చరణం:
జీవితాన కష్టాలు ఎన్ని ఎదురైనా
పేదవారి బాధల్లో పాలుపంచుకున్నావు
గాంధీజీ ఆశయాలు ఆచరణలో పెట్టి
సమ సమాజ స్థాపనకు నడుంకట్టినావు ॥ అమరజీవి॥
చరణం:
ఆంధ్రులు ఆరంభశూరులు కారనీ
అవసరమైతే అగ్నికీల లౌతారని
త్యాగ నిరతితో నీవు సందేశం ఇచ్చావు
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయువు పోశావు ॥ అమరజీవి॥