[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
విక్రమసింహపురి:
[dropcap]తి[/dropcap]క్కనామాత్యుడు భారతాంధ్రీకరణం చేసిన నెల్లూరులో ప్రజల చిరకాల వాంఛకు ఫలంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 2008లో ఆరంభమైంది. ప్రారంభంలో ఆరు కోర్సులుండగా ప్రస్తుతం 17 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు నడుస్తున్నాయి. తొలి వైస్ ఛాన్సలర్‌గా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఆంగ్లశాఖచార్యులుగా పదవీ విరమణ చేసిన ఆచార్య సి.ఆర్.విశ్వేశ్వరరావు నియుక్తులయ్యారు.
ఆంగ్లభాషాచార్యులు ఉపకులపతులుగా నియమించబడిన వివరాలలోకి వెళితే గత 70 సంవత్సరాలలో ఆరేడుగురు మాత్రమే పని చేయడం విశేషం.
ఉపకులపతి అయిన ఆచార్యులు | విశ్వవిద్యాలయం | మాతృసంస్థ |
ఆచార్య కె.శ్రీనివాస అయ్యంగార్ | ఆంధ్రవిశ్వ కళా పరిషత్
(జూన్ 1966-నవంబరు 1968) |
ఆంధ్రా యూనివర్శిటీ |
ఆచార్య యం.వి.రామశర్మ | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (1980-84) | యస్.వి.యూనివర్శిటీ |
ఆచార్య వీణా నోబెల్ దాస్ | శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం | హైదరాబాదు ఎగ్జిబిషన్ సొసైటీ మహిళా కళాశాల |
ఆచార్య సి.ఆర్. విశ్వేశ్వరరావు | విక్రమసింహపురి విశ్వవిద్యాలయం (2008-2011) | శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
ఆచార్య వి.వి.యన్.రాజేంద్రప్రసాద్ | యస్.వి.యూనివర్శిటీ (2019-20) | శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
ఆచార్య జి. సుందరవల్లి | విక్రమసింహ పురి విశ్వవిద్యాలయం | యస్.వి.యూనివర్శిటీ |
ఆచార్య సి.సుబ్బారావు | ఆంధ్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు | శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
|
ఆచార్య వి.కె.గోకక్ | సత్యసాయి విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యక్షులు (1981-85) | సెంట్రల్ ఇన్‌స్టిటుట్ ఆఫ్ ఇంగ్లీషు, హైదరాబాదు |
గురు పరంపర:
ఆచార్య కె.ఆర్.శ్రీనివాస అయ్యంగార్ (1908 ఏప్రిల్-1999 ఏప్రిల్) ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగం ప్రారంభించినపుడు 1947లో అధ్యాపకులుగా చేరారు. 1966 జూన్ – 1968 నవంబర్ మధ్య ఉపాధ్యక్షులు. అతి ప్రాచీనమైన ఆంగ్ల విభాగానికి దిశానిర్దేశం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా 1969-77 మధ్య, ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షులుగా (1977-78) వ్యవహరించారు. సాహిత్య అకాడమీ ఫెలోగా గౌరవింపబడ్డారు (1985). భారతీయత ఉట్టిపడే ఆంగ్ల భాషా రచనలకు ఆయన పేరు తెచ్చుకొన్నారు. అరవిందుని సావిత్రి పై ఆయన అథారిటీ. ఆయన కుమార్తె ప్రేమానందకుమార్ చక్కటి విదుషీమణి.
సత్యసాయి విద్యాసంస్థల వి.సి.గా ఆచార్య వి.కె.గోకక్ 1981-85 మధ్య వ్యవహరించారు. ఆయన కుమారులు అనిల్ గోకక్ IAS, అదే విశ్వవిద్యాలయ వి.సి. 2008 తర్వాత.
ఆచార్య యం.వి.రామశర్మ:
మొవ్వ రామశర్మ వాగ్గేయకారుడైన క్షేత్రయ్య వారసులు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖను తీర్చిదిద్దిన ప్రతిభావంతులు. రామశర్మ మిల్టన్ కవి అభిమాని. ఆంగ్ల విభాగంలో ఆచార్యులుగా చిరకాలం పని చేసి, అదే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా 1980-84 మధ్య దిశా నిర్దేశం చేశారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంపికైన తొలి వైస్ ఛాన్సలర్. ఆ పరంపర తర్వాత కొనసాగింది.
మిల్టన్ కవిత్వంపై పలు ఆంగ్ల రచనలు ప్రచురించారు.
- THE HEROIC ARGUMENT : A study of Milton’s heroic poetry
- THINGS UNATTEMPTED : A study of Milton
- MILTON AND THE PROPHETIC STRAIN
- THE FAREWELL PARTY – A NOVEL
- LOOK HOME WORD – A NOVEL
- MILTON AND THE INDIAN EPIC TRADITION
- SAKUNTALA – A play based on Kalidasa Sakuntalam
- HARMONY RESTORED – studies in Shakespeare
- PASTURES NEW – A NOVEL
- KSHETRAIAH – NOVEL
దాదాపు 23 గ్రంథాలు ప్రతిష్ఠాత్మకమైనవి. వీరి కుమార్తె శ్రీమతి యం.పద్మ, IAS, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ కమీషనర్‌గా 2019లో రిటైరయ్యారు.
విక్రమసింహపురిలో విశ్వేశ్వరుడు:
విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు తొలి ఉపాధ్యక్షులు ఆచార్య సి.ఆర్.విశ్వేశ్వరరావు (2008-2011). అదే జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడే వైస్ ఛాన్సలర్ కావడం విశేషం. వీరి తండ్రి రామస్వామిరావు జిల్లాపరిషత్‌లో పలు పాఠశాలల్లో హెడ్మాష్టర్ (బుచ్చిరెడ్డి పాలెంలో మా హెడ్ మాష్టారు. విశ్వేశ్వరరావు, నేను 1955-56లో సెకండ్ ఫారంలో సహాధ్యాయులం).
ఒక నూతన సంస్థను అంకురదశ నుండి ప్రారంభించడం కష్టం. విశ్వం 1968లో తిరుపతి విశ్వవిద్యాలయంలో రామశర్మ ప్రియశిష్యులై ఎం.ఏ పూర్తి చేశారు. ఆయన పర్యవేక్షణలో ఆంగ్ల కవి టి.యన్.ఇలియట్‌పై పరిశోధనకు పి.హెచ్.డి లభించింది. తొలుత తిరుపతిలో ఉద్యోగించి 1977లో అనంతపురం యూనివర్శిటీ ఉపన్యాసకులై 2006లో ఆచార్య పదవి నుండి రిటైరయ్యారు. వీరి పర్యవేక్షణలో 15 మంది పి.హెచ్.డి, 23 మంది ఎం.ఫిల్ పొందారు.
వై.యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో తొలి వి.సి.గా నియమితులై వి.ఆర్. హైస్కూలు భవనాలలో యూనివర్శిటీకి పురుడుపోశారు. దినదినాభివృద్ధి చెందించిన ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కాకుటూరులో 75 ఎకరాల స్థలం కేటాయించింది. 2011లో ముఖ్యమంత్రి యన్.కిరణకుమార్ రెడ్డి చేత మూడు భవనాలకు విశ్వేశ్వరరావు శంఖుస్థాపన చేయించారు. ఆ తరువాత తరువాత వి.సి.గా వచ్చిన వీరయ్య కందుకూరు ప్రభుత్వ కళాశాలలో మా విద్యార్థి.
విశ్వేశ్వరరావు అనంతపురంలో కొంత కాలం ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా, రెక్టారుగా, డీన్‌గా పలు హోదాలలో పని చేసి ప్రశంసలందుకున్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించారు. బ్రిటీష్ సాహిత్యం, అమెరికన్, కెనడియన్ సాహిత్యం అభిమాన విషయాలు. 8 ప్రామాణిక గ్రంథాలు ప్రచురించారు.
బి.ఆర్.రతన్ అవార్డు, అనంత లక్ష్మీకాంత సాహితీ పీఠం అవార్డు (2008), ఉత్తమ అధ్యాపక అవార్డు లభించాయి. హైదరాబాదులో స్థిరపడిన వీరు ఏడు పదుల వయస్సులో కూడా వివిద విశ్వవిద్యాలయాలు, యూ.జి.సి నిపుణులుగా సేవలందిస్తున్నారు. స్నేహశీలి, అభ్యుదయ భావజాలం గల విశ్వేశ్వరరావుకు విద్యారంగంలో, ప్రభుత్వ అధికారులలో మంచి పేరు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంగ్లీష్ స్టడీస్ వారి జర్నల్, కామన్‌వెల్త్ రివ్యూలకు సంపాదకత్వం విశిష్టం.
సాహితీ జయప్రకాష్:
విక్రమసింహపురి విశ్వవిద్యాలయ తెలుగు శాఖకు తొలినాళ్లలో మార్గదర్శనం చేసిన విశిష్ట వ్యక్తి యస్.జయప్రకాష్ (1949 జూన్). శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ, మదరాసు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశారు(1981). చెంగల్పట్ జిల్లా గ్రామనామాలపై యస్.అక్కిరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేశారు.
మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో 1985 జూన్‌లో ఆచార్యులుగా చేరి 2009 జూన్‌లో 24 సంవత్సరాల సుధీర్ఘ సర్వీసు తర్వాత రిటైరయ్యారు. 2010-12 మధ్య తిరుపతిలోని తమిళశాఖలో ప్రాజెక్టు ప్రొఫెసరు. జెరుసంలంలోని హిబ్రూ విశ్వవిద్యాలయ భారతీయ భాషావిభాగంలో విజిటింగ్ ప్రొఫెసరు.
విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో మూడేళ్లు తెలుగు శాఖ పర్యవేక్షించారు. వీరి సంపాదకత్వంలో ‘విక్రమసింహపురి సర్వస్వం’ బృహద్గ్రంథం రూపొందింది.
వీరి పర్వవేక్షణలో ఒకరు హి.హెచ్.డి, 12 మంది ఎం.ఫిల్ పట్టాలు పొందారు.
రచనా నైపుణ్యం:
‘పరిశోధనా విధానం’ అనే గ్రంథం విశాలాంద్ర ప్రచురణ సంస్థ ద్వారా 1990లో ప్రచురించబడి ఇప్పటికి 15 పునర్ముద్రణలు పొందింది. విశ్వవిద్యాలయం పాఠ్య గ్రంథమైంది. తమిళ, తెలుగు భాషల తులనాత్మక గ్రంథాలు పలు ప్రచురించారు. తమిళ పంచకావ్యాలు(2008) మధురై కామరాజ్ విశ్వవిద్యాలయ పాఠ్య గ్రంథం. పెక్కు అనువాద గ్రంథాలను ద్రవిడ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, వేదిక్ విశ్వవిద్యాలయం, తిరుపతి దేవస్థానాలకు వ్రాశారు.
తెలుగు నుండి తమిళం, ఇంగ్లీషు నుండి తెలుగు, సంస్కృతం నుండి తెలుగు, తెలుగు నుండి మలయాళం, మలయాళం – తెలుగు – ఇలా బహుముఖీన ప్రతిభా సంపన్నులు జయప్రకాష్. పదవీవిరమణానంతరం తిరుపతిలో స్థిరపడ్డారు. మూడు విశ్వవిద్యాలయాలలో పని చేసిన ఘనత వీరిది.