[dropcap]ఆ[/dropcap]కాశంలో మబ్బేదో
ఒంటరిగా బిక్కు బిక్కు మంటున్నట్టు
కొమ్మ మీద పక్షి ఒంటరిగా గొంతెత్తి
సోలో గీతం పాడుతున్నట్టు
కుండీలో ఒంటరి మొక్క
భయం భయంగా ఊపిరి పోసుకుంటున్నట్టు
అక్షరాల మధ్య కాటగలిసిన
నేను ఒంటరిగా
కొత్త భావాల్ని వెతుక్కుంటున్నాను
ఇంతకూ ఒంటరితనం
వరమా శాపమా