ఓ జ్ఞాపకం

0
3

[dropcap]మ[/dropcap]రుగునపడిన ఓ జ్ఞాపకం
నన్నిప్పుడు కౌగిలించుకుంది
మద్రాస్ మౌంట్ రోడ్డుపై పరుగులు తీసిన పాదరసం
హైదరాబాద్ అబిడ్స్ రోడ్డుపై కాళ్ళను చుట్టుముట్టింది
మెరీనా సముద్ర తీరాన లంగరేసిన చూపు
హుస్సేన్‌సాగర్ అవతలివైపున ఆవిష్కరించుకుంది
జ్ఞాపకానికి ప్రేమ గుర్తుగా
మా ఇద్దరి పెదవుల మధ్య విచ్చుకున్న నవ్వే సాక్ష్యం
మాట గొంతును పెకిలించలేక
మౌనమైన ఆనందం మధ్య కొట్టుకులాడుతోంది
హృదయ స్పందనలు సంగమించి
స్నేహం స్వేచ్ఛగా గొంతువిప్పుకుంటోంది
చీకటి రాత్రిలో దూరంగా వెలుగుతున్న విద్యుద్దీపపు కాంతి
మమ్మల్ని సల్ఫ్యూరిక్ యాసిడ్‌లో కడిగేసింది
ముఫ్పైయేళ్ల కింద పంచుకున్న భావాలు వాడిపోలేదని
వర్తమానాన్ని చైతన్యకాంతితో నింపింది
అనాటి ఆ జ్ఞాపకాలకు రక్తమాంసాలు లేకపోతే
ఇప్పటి మా వ్యక్తిత్వాలు వెలిగించలేకపోయేవి
అపరిచిత వ్యక్తుల్లా తను అటూ
నేను ఇటూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here