[dropcap]అ[/dropcap]డుగులో అడుగేసుకుంటూ వచ్చి
ఎదుట నిలబడ్డది ఎవరు
మృత్యువా మిత్రుడా
మసక చీకటిలో తడి కళ్ళకు
ఎట్లా కనిపించేది
ఎట్లా తెలిసేది
ఇన్నేళ్ళుగా
బతుకే అర్థం కాలేదు
ఎప్పుడో ఒక్కసారే వచ్చే
చావెట్లా అర్థమవుతుంది
చావు సరే
నన్ను బతుకే భయపెడుతూ వుంది