[dropcap]స్పం[/dropcap]దన నా హృదయాంతారాళంలో
గూడుకట్టుకొని ఉన్న గుణం…
దేని గురించి దేని కోసం స్పందించాలి???
ప్రేమ, బాధ, విరహం, త్యాగం వంటి వాటిపై స్పందిస్తే
బయల్దేరిందమ్మా భావ కవయిత్రి అని అంటున్నారు
పక్షులు, పైరగాలి, సెలయేళ్ళ చిరు సవ్వడి పై స్పందిస్తే
వంచిందమ్మ ప్రకృతి ఆరాధకురాలు అని అంటున్నారు
ఆడవాళ్ళ కష్టాలు, కన్నీళ్లు,దుఃఖాల పై స్పందిస్తే
మగువ మంచాల అని,స్త్రీవాది అని ముద్ర వేస్తున్నారు
సమాజంలో జరిగే న్యాయ, అన్యాయాలపై స్పందిస్తే
సామాజిక జనోద్ధారణ చేసే సామాజిక కవి అంటున్నారు
మంచి విలువలు, మానవత్వం గురించి స్పందిస్తే
ముసలమ్మ, ఛాందసవాది అని అంటున్నారు
మనిషిని, విలువలు తెలిసిన మనిషిని
నేను ఏ వర్గానికి చెందిన దాన్ని కాను
స్పందించటం నా నైజం, రాత ద్వారా ప్రతిబింబిచటం నా మతం