ఒక్క ప్రశ్న..

0
3

[dropcap]మ[/dropcap]నిషిని చీల్చుకొని బయటకొచ్చిన
ఓ ప్రశ్న
భూమిని డీ కొట్టి
ఖండాల్ని తాకి
సముద్రాల్లో తేలి
తిరిగి తన పాదాల్ని చేరి,

ఓ కన్నీటిబొట్టు ముందు
భూగోళం చిన్నదని,
ఓ నెత్తుటి చుక్క ముందు
ప్రపంచం పలుచనని
మనిషికి మోకరిల్లింది.

మనిషిలో ‘మనసు సృష్టి’
సత్యం.
స్వర్ణం..

మనసుతో మనిషి శక్తే
స్వర్గం
స్వంతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here