[dropcap]నా[/dropcap] లోపల ఒక ఇల్లుంది
ఆ ఇంట్లో నా వెలుపలి ఇంట్లో వాళ్లే ఉంటారు
కొత్త ముఖాలతో
ఆ ముఖాల్లో కపటం నాటకాలుండవు
మాయ మర్మాలుండవు
అవకాశవాదాలుండవు, అధికారాలుండవు, అవరోధాలుండవు
ఆ ఇంట్లో నన్ను నేనుగా ఆవిష్కరించుకుంటాను
ఇల్లంతా నేనైపోతాను
అక్కడ చిన్న చినుకుకే మొక్కనై, చెట్టునై,
కొమ్మలతో, రెమ్మలతో గర్వంగా ఆకాశాన్నం టుతాను
నా వెలుపలి ఇంట్లో అంతా అస్తవ్యస్తమే!
అందుకే వెలుపలి ఇంట్లో బతికేస్తూ
లోపలి ఇంట్లో జీవిస్తున్నా!