[dropcap]అ[/dropcap]లిసిన మనసులని సేద తీర్చే చిరునవ్వుల జాబిలమ్మ నేను
అమ్మతనం యొక్క కమ్మతనాన్ని అమ్మకి తెలిపిన చిన్నారి నేను
నాన్న ఒడిలో గారాబంగా ఎదిగిన యువరాణి నేను
చదువుల సరస్వతి నేను
ఆత్మీయత ఎరిగిన దానిని నేను
పసి పాప మనసు నాది
సాగరమంత ప్రేమ నాది
అచంచల విశ్వాసం నాది
హిమాలయాల ఔన్నత్యం నాది
భయస్తురాలిని.. కానీ భద్రకాళిని
అణకువ కలిగిన అణుబాంబుని
నేను ఎప్పటికీ సబలను
ఏదైనా సాధించగల ధీశాలి నేను
అంధ విశ్వాసాలు వదలండి
నన్ను ప్రపంచంలోకి రానివ్వండి
మీ గుండెల మీద కుంపటిని కాను
మీ భాగ్య దేవతను నేను
మీ ఇంటి దీపాన్ని నేను..
మీ ప్రేమ మాత్రమే కోరే దానిని..
నేను….మీ ఆడపిల్లను..
(ఆడపిల్లల్ని వద్దనుకుంటే ప్రపంచం అమ్మ లేని అనాథ అవుతుంది)