[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
01. శ్రీ కైవల్య పథం కావాలన్నాడని ఇతణ్ణి తూకం వెయ్యడానికి పొమ్మన్నారా? (4). |
04. సీక్రెట్ కింగ్! భక్తిరాజ్యానికి ప్రభువు. (4). |
07. ఈ మొక్కని కలుపుకు పోవడం కాదు. ఏరి పారేయాలి. (5). |
08. ఇంటి పేరు దుర్గం! (2). |
10. చిన్న పిల్లని ఓసారి పిలవండి. (2). |
11. తెల్లవాని చూపులు! (3). |
13. డూప్లికేట్ తన కలుగులోకి ఈడ్చుకుపోయింది.(3) |
14. కళ్ళలో కంపల్సరీ! ఇళ్ళలో ఉండొచ్చు. (3). |
15. సౌభాగ్య, మాన్య శ్రీ ని క్లుప్తంగా వ్రాస్తే చాలు.(3). |
16. మనము ధరించేది. (3). |
18. గాలిపటమైతే కనిపిస్తుంది కానీ ఇది కనిపిస్తుందా రంగా? (2). |
21. ఋషి ముందు నిద్రలో ఉన్నాడు.గమనించు.(2). |
22. Bargain కుదరలేదని ఇలా అనేసుకున్నారా?(5) |
24. నిన్న దమ్ము చూపేవు కానీ ఇవాళ తేలికగా ఉండు. (4). |
25. వెనుక చదును చేయడం కాదు! వాయించేయడం! (4). |
నిలువు:
01. పోలీసు కోలాలు! లీలా, వచ్చేయ్. పనికిమాలిన మాటలెందుకు?(4). |
02. పూర్ణ చంద్రుడు వచ్చుట! (2). |
03. రాజులు ముచ్చట గా చేసే ఆగడము.(3). |
04. మొగోడు చెదిరిపోయాడు.(3). |
05. ఒకవైపు పడుకోడానికి. (2). |
06. గిరగిర మని జాలువారేవీ, జులజుల మని పాలుకారేవీ వెనక్కి ఉంటాయి. (4). |
09. టమాట రంకు కాదు. కాస్త నొక్కి పలుకుతే మోసం చెయ్యడానికి ప్రదర్శన. (5). |
10. షెడ్డు సైన్స్! ద్వాపరంలో ఒకతను పీహెచ్డీ చేశాడట!(5). |
12. నీటిలో మునిగినా కళ్ళు మూయవు. (3). |
15. మెరుపు లాంటి అప్సరస కోసం చిన్న బేరం! (4). |
17. సాయంత్రం కోసం పునిమాము. (4). |
19. మామిడి చూద్దాం. (3). |
20. వీరపై ఉల్టాగా లాబీయింగా?(3). |
22. స్పేస్ లో ఏడుపు ప్రారంభమా?(2). |
23. హమ్మయ్య! ఆపదని తేలిక చేశారు. థాంక్స్! (2). |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మార్చ్ 01 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 30 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మార్చ్ 06 తేదీన వెలువడతాయి.
కొత్త పదసంచిక-28 జవాబులు:
అడ్డం:
1.నెఱజాణ 4. దివసము 7. వరద గుడి 8. వంన 10. మన్నె 11. కటీస 13. కోకలు 14 వెంకటే 15. వటుడు 16. రందఉ 18. రూలు 21. ముక్క 22. తొలివాకిలి 24. నికరము 25. తవారుత
నిలువు:
1.నెలవంక 2. జావ 3. ణరము 4. దిగులు 5. వడి 6. మువ్వన్నెలు 9. నటీనటులు 10. మకరందము 12. సంకటి 15. వరూధిని 17. ఉక్కపోత 19. కిలిము 20. చకిత 22. తొర 23.లివా
కొత్త పదసంచిక-28 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అన్నపూర్ణ భవాని
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అపర్ణాదేవి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావన రావు
- ద్రోణంరాజు మోహనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- కృష్ణవిరజ
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తాల
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- పి.వి.ఆర్.మూర్తి
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామిగాని ఉమాదేవి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హిరణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వేణుగోపాల రావు పంతుల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.