[dropcap]ఈ[/dropcap] సంవత్సరం పోటీకి వచ్చిన సుప్రసిద్ధ సాహిత్య స్రష్టల గ్రంథాలు పరిశీలించిన న్యాయమూర్తుల నిర్ణయానుసారంగా పురస్కారాలు ప్రదానం చేసే అవకాశం కలిగి మేం ఆనందిస్తున్నాము.
మా అమ్మ
1.కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం – 2022
‘గణిక‘ గ్రంథానికి శ్రీమతి విజయ భండారు గ్రహిస్తారు.
న్యాయమూర్తులు: డా॥రాసాని వెంకట్రామయ్య, డా॥ జి. అరుణకుమారి, డా॥ జి.బాలసుబ్రహ్మణ్యం
మా నానమ్మ
2.కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం – 2022
‘జక్కులు‘ గ్రంథానికి శ్రీ మంథని శంకర్ స్వీకరిస్తారు.
న్యాయమూర్తులు: ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య గారపాటి దామోదరనాయుడు, ఆచార్య రాచగల్లు రాజేశ్వరమ్మ.
మా తాతయ్య
3.కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారం – 2022
‘తెలుగు నవల-ప్రయోగ వైవిథ్యం‘ గ్రంథానికి శ్రీ కె.పి.అశోక్ కుమార్ అందుకొంటారు.
న్యాయమూర్తులు: ఆచార్య కాటూరి శారద, ఆచార్య వెల్దండ నిత్యానందరావు, ఆచార్య మేడిపల్లి రవికుమార్
న్యాయమూర్తులకు కృతజ్ఞతలు. పురస్కారాలు పొందిన సాహితీ స్రష్టలకు అభినందనలు. పురస్కారాల పోటీకి తమ రచనలు పంపిన సుప్రసిద్ధ సాహితీ ప్రముఖులకు ధన్యవాదాలు. మా అమ్మ జయంతి, వర్ధంతి రోజున ఒక్కొక్క పురస్కారానికి నగదు రూ.15,000/-, మెమొంటో, శాలువా, 26.2.2022 నాడు జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయటం జరుగుతుంది.
ఆచార్య కొలకలూరి మధుజ్యోతి (94419 23172)
ఆచార్య కొలకలూరి సుమకిరణ్ (99635 64664)