[dropcap]క[/dropcap]లుసుకున్న కన్నులు పంచుకున్న ఊసులు..
ఎప్పటికీ నన్ను వీడని జ్ఞాపకాలే!
ఒకే లయగా మ్రోగుతున్న గుండెల సవ్వడులు..
నువ్వెక్కడ వున్నా నా హృదిలో మెదిలే సుమధురాలే!
సాగర తీరాన సంబరంగా కలిసి వేసిన అడుగులు..
నాడు అలల తాకిడికి చెదిరినా నేడు ఇష్టమై పలకరించే స్వప్నాలే!
ప్రియమైన నీ ఒడిలో తలవాల్చి వెచ్చని చెలిమి కౌగిళ్ళలో జతగా నీ నేను..!
అలికిడి లేకుండా నిశ్శబ్దంగా కదులుతున్న కాలం..
కమ్మని ఊహల ఊయలలో ఊరేగిస్తుంటుంది!