[dropcap]పో[/dropcap]టీదారుల, కవుల కోరిక మేరకు కవితల పోటీ గడువును మరో వారం రోజులు పెంచేందుకు నిశ్చయించింది సంచిక.
కవితలు అందడానికి తాజా గడువు: 7 మార్చి 2022.
మిగతా నియమ నిబంధలన్నీ క్రింద ప్రస్తావించినవే.
~
సంచిక వెబ్ పత్రిక కవితల పోటీ, కథల పోటీలను నిర్వహించాలని నిశ్చయించింది.
సంచిక కవితల పోటీ 2022 నియమ నిబంధనలు:
కవిత అన్నది వాదాలు, వివాదాలు, నినాదాలు కాదు. కవితల్లో, రాజకీయాలు, సిద్ధాంతాలు నిషిద్ధం. కవిత ఒక అనుభూతి. కవిత అనుభూతికి అక్షర రూపం. కవిత ఒక భావన. కవిత తపస్సు ఫలితం. అలాంటి కవితలకు ఆహ్వానం.
వచన కవిత అయినా కావచ్చు. పద్య కవిత అయినా కావచ్చు. కవిత ఏదయినా సరస్వతీదేవి పాదాలను అలంకరించే అపురూపమయిన కుసుమంలా భావించి సృజించాలి. కవితల్లో మానవ సంవేదనలు, ఆవేదనలే కాక, జీవితాన్ని ఒక దైవదత్తమయిన అపూర్వమయిన బహుమతిలా భావించి, ఆనందంగా, ఒక పండుగలా జీవించే స్ఫూర్తినిచ్చే కవితలకు ఆహ్వానం.
ఒక ఆకులోని అందాన్ని, నీటి అణువులోని అనంతత్వాన్ని, వీచే గాలి మోసే సుగంధంలోని పరిమళాన్ని, నిశ్చల పర్వతం నేర్పే జీవిత పాఠాల్ని, సూర్యోదయం సౌందర్యం, సూర్యాస్తమయంలోని ఆనందం, పక్షి పాటలోని మాధుర్యం, మారే ఋతువుల్లోని అద్భుతం….. ఇలా ఒకటేమిటి, మనచుట్టూ వుండి మౌనంగా పాఠాలు నేర్పే విరాట్ ప్రకృతిలోని ప్రతి అంశాన్ని ప్రకటించే అపూర్వానుభూతి కవిత్వానికి ఆహ్వానం…
కవితల నిడివి పరిమితి స్వచ్ఛందం. కవిత ఖండ కావ్యం కాకుండా చూసుకోవాలి. కవితలు ఫిబ్రవరి 28, 2022 లోగా సంచికకు అందాలి.
కవితలను kmkp2045@gmail.com లేక. WhatsApp to 9849617392 లేక plot no32, H.No 8-48, Raghuram Nagar Colony, Aditya Hospital lane, Dammaiguda, Hyderabad-83 కు పంపాలి.
కవితలు పంపేటప్పుడు కవిత శీర్షిక క్రింద కవి పేరు, అడ్రెసు, ఫోను నంబరు, ఈమెయిల్ అడ్రెసులు స్పష్టంగా రాయాలి. ఈమెయిల్ సబ్జెక్టులో, పోస్టల్ కవర్లపైన సంచిక కవితల పోటీ 2022కి అని తప్పనిసరిగా వ్రాయాలి.
కవితల ఫలితాలు 2022 మార్చ్ నెల చివరి ఆదివారం సంచికలో ప్రచురితమవుతాయి.
ఈ పోటీలో మొదటి, ద్వితీయ స్థానాలుండవు. మొత్తం పది కవితలను ఎంచుకుని, ఎంపికయిన 10 కవితలకు వెయ్యి రూపాయల చొప్పున బహుమతి అందచేస్తాము.