[dropcap]క[/dropcap]లా? నిజమా?
ప్రశాంతంగా మూసిన కళ్ళ ముందట ఒక్కసారిగా
ఆక్రందనలు, అరణ్యరోదనలు మిన్నంటాయి
కాంతివంతమైన కంటి వెలుగు నేడు కాంతి లేని గాజు కళ్ళు అయ్యాయి
లేతగులాబీరంగు పొదుముకొని చిరునవ్వులు చిందించిన ఆధరాలు
అర్రలు చాచి గుక్కెడు నీళ్ళకోసం అదిరాయి/పరితపించాయి
నెయ్యముతో ఉండాల్సినవి కయ్యానికి కాలు దువ్వుతున్నాయి
ద్వేషం అనే ఆజ్యం పోస్తూ విద్వేషాన్ని రగిలిస్తున్నాయి
న్యాయమేది? అని ఆక్రోశించిన అన్యాయమే రాజ్యమేలుతుంది
నిస్వార్థంతో చేసిన శ్రమ స్వార్థంలో కొట్టుకుపోయింది
నీతిని కింద వేసి అణగదొక్కి అవినీతి పైకి ఎదుగుతుంది
అహింసను కమ్మేసి హింస వెలిగిపోతుంది
ఇలాంటి సమయాల్లో కోరుకునేది ఒకటే ‘శాంతి’
అది రావాలని…చిరకాలం ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుందాం