[dropcap]తె[/dropcap]లిసినంతలో
కాలిబాటలే
రహదారులు.
దారిపొడవునా
చెమట బిందువులే
సౌరభాలు.
పరుగెత్తిన జాడలులేవు.
దారి మరచిన దాఖలా లేవు.
ప్రయాణం ఆగినది లేదు.
తీపి రోజులలోని
చేదు పుటలు ఇప్పటికి మాట్లాడతాయి.
చేదు రోజులలోని
మధుర క్షణాలు ఎప్పటికి మరచిపోనివి.
వయస్సు శరీరాన్ని మార్పుకు గురిచేసినా
మనసు బుద్ధికి కట్టుపడి అలాగే ఉంది.
మనిషిలో కొత్తగా ఏమి లేవు…
కొత్త పాత అంటూ లేని
విలువలెప్పుడు ఒక్కటే.