[dropcap]వి[/dropcap]వాహము జరిగి వత్సరము కాలేదు
వారసుడు రాలేదట వారి ఇంట
పెళ్ళి అయ్యి పన్నెండు మాసాలు గడిచినా
పాపడు అడుగిడలేదట దాయాదుల ఇంట
నీ తోటి వారైన నీ స్నేహితులకు,
నీ ఈడు వారికి శిశువులు కలుగగా
నీ కేల ఇంకా లేరు పిల్లలు అని తల్లి తనయుని
ప్రశ్నించ అమ్మాయిలో లోపమేమో అని సంశయించ
వ్యక్తిగత విషయములలో జోక్యం చేసుకోవద్దని
కోడలు పలుక తల్లియైన నీకు తల్లడిల్లును హృదయం
అది ఎరిగి ఆమె మారు మాటాడక నిలిచె
నీకే ఒక ఆడబిడ్డ ఉన్న
అయిదారు వర్షాలు గడిచినా
సంతానం కలగక పోయినచో
అంతా దైవ కటాక్షం అని సర్దిచెప్పెదవు
ఇటువంటి తార్కాణాలు చెప్పి సర్ది చెప్పగపోగా
దానిని గోప్యంగా ఉంచి తనయునికి
వర్షములో సంతనం కావలెనని కోరెదవు
కోడలైనా కూతురైనా కాదా స్త్రీ
కూతురి విషయం గోప్యం
కోడలి విషయం బాహ్యం
సంతానం జాప్యం అయినంతమాత్రాన
కాదు అమ్మాయిలో లోపం చేయించుకోజాలదు కాయ పరీక్షలు
ఎవరికి ఏ ప్రణాళికలు కలవో
ఏ ఆలోచనలు కలవో నీకేమి ఎరుక
చెంత లేని నీకే యోచించి యోచించి
ఇంత చింత కలుగగా
జన్మనిచ్చి అమ్మ అను అమృత పలుకులు వినవలెనని
ఆరాటపడు ఆ స్త్రీ కి ఎంత తపనో నీవు చూడనేరగరావు
నీ యోచనలు నీవు వ్యక్తపరుస్తున్నావు
నిన్ను బాధపెట్టజాలక ఆమె ఏమి పలుకక మౌనం కూడి ఉన్న
అది కాదు సంతానమన్న అయిష్టత
శిశువులు కారు సంత లోని సరుకులు
ఇంకెన్నాళ్ళు పట్టునో పుట్టుటకను పలికిన పిమ్మట
అంచనా వేసి సుమారు ఇన్నాళ్ళు పట్టును అని చెప్పుటకు
సంతానమనిన దైవ ప్రసాదం
సిందూర పినాకిని తయారు చేయుటకైనా
సిందూర శారంగం తయారీకైనా పట్టును తగు సమయం