[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఆలుమగలిద్దరూ సగం స్నానమే చేసారు సరిగ చేయండి. (4) |
4. ఆయన తన డిమాండ్ తీర్చేవరకు దీన్ని కూడా ముట్టనన్నాడట.(4) |
7. అంత లావుగ లేకున్నా ‘పోట్లాట’ అంటే ఇష్టమట.(5) |
8. వెనుతిరిగిన రాయి (2) |
10. పూర్వపు సినిమా ల్లో ఈ రావువి అన్నీ దుష్ట పాత్రలే (2) |
11. సెలూన్ లోనే కాదు పేకాటలో కూడా అవుతుందిది. (3) |
13. అఖండుడే! చివరికి సన్నబడ్డాడు (3) |
14. విమానాలు అప్పుడప్పుడు గాలిలో ఇవి కొడుతుంటాయి (3) |
15. ఇది కాని చోట గొప్పవారమనకూడదన్నాడు శతకకారుడు (3) |
16. వయసుకి మించి మాట్లాడితే ఇలానే ఎత్తిపొడుస్తారు (3) |
18. ఇది వంచి నమస్కరించాడు. వాడు తల తీసేసాడు.(2) |
21. చిన్నగ్రామము. మొదట్లోనే చిన్నబోయింది.(2) |
22. వెంకన్న మాఁవగారు. (5) |
24. నూరేళ్ళు బతకాలా? ఈ గండంతో(4) |
25. నీ గోడు చెప్పటానికి ఈ విందుకే రావాలయ్యా తిరమలయ్యా! (4) |
నిలువు:
1. వాడు గెలవకపోవటానికి ఇన్ని కారణాలట (4) |
2. దీనికి తగ్గ బొంతని చూడండి (2) |
3. వేమూరి వారు నీరసించిపోయారు (3) |
4. శాస్త్రి గారికి ప్లాస్టర్ వెయ్యండి (3) |
5. కచ్చికట అని క భాషలో చెప్పింది. దేనిగురించట? (2) |
6. టెంకాయ లా గట్టివాడు ఈ అల్లరిపిల్లవాడు (4) |
9. దీన్ని త్రిపురాసురుడి సంహరణ కోసం సృష్టించాడట ముక్కంటి(5) |
10. భయంతో పాటు వచ్చేది (5) |
12. రాజకీయనాయకులు ప్రత్యర్ధుల మీద ఎక్కువగా వెళ్ళగక్కుతుంటారు (3) |
15. అది పరక కాదు పంచమం (4) |
17. వీడు వానసిరా ట (4) |
19. ఏదైనా ముదిరిన తర్వాత పడేదిందులోనే (3) |
20 ఇతనిది భరించ రాని గోల. “ఇట్లు మీ విధేయుడు”(3) |
22. ఈ రోజు ఈ వారం (2) |
23. వింధ్యరాజు ఆద్యంతాలు తిరగబడ్డాయి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 05వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 4 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 10 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 2 జవాబులు:
అడ్డం:
1.ఆకర్షక 4. ప్రవచన 7.హవానములు 8. నుంకు 10. ఆబ 11. చిక్కము 13. ముకాలి 14. బాదుషా 15. అడుసు 16. రవీపై 18. సాగు 21. ణశా 22. మాయాబజారు 24. రిసీవరు 25. రాచిలుక
నిలువు:
1.ఆదినుంచి 2. ర్షహ 3. కవాలి 4. ప్రముఖ 5. వలు 6. నరబలి 9. కుక్క గొడుగు 10. ఆకాశవీణ 12. చదువు 15. అసావేరి 17. పైశాచిక 19. తయారు 20. బంజారా 22. మావ 23. రుచి
నూతన పదసంచిక 2 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అన్నపూర్ణ భవాని
- అనురాధా సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఈమని రమామణి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాస రావు
- కృష్ణ విరజ
- లలిత మల్లాది
- ఎమ్మెస్వీ గంగరాజు
- యం. అన్నపూర్ణ
- ఎం. కృష్ణజ్యోతి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పాటిబళ్ల శేషగిరి రావు
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఆర్.మూర్తి
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- ప్రవీణ డా.
- రామలింగయ్య టి
- రంగావఝల శారద
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శాంత మాధవపెద్ది
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.