[dropcap]క[/dropcap]వి, రచయిత గుండాన జోగారావు షష్టిపూర్తి సందర్భంగా ఇటీవల ‘రమ్యభారతి’ పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లఘు కవితల పోటీ’లకు దేశంలో వివిధ ప్రాంతాలనుండి మొత్తం నుండి 371 కార్డులు పరిశీలనకు వచ్చాయి.
వాటిలో ఉత్తమంగా ఉన్న క్రింది వారిని విజేతలుగా ప్రకటించడమైనది.
మొదటి బహుమతి: పెనుగొండ బసవేశ్వర్, వావిళ్ళపల్లి; ద్వితీయ బహుమతి: లోగిశ లక్ష్మీనాయుడు, సింహాచలం, తృతీయ బహుమతి: బి.కళాగోపాల్, నిజామాబాద్, చతుర్ధ బహుమతి: మార్ని జానకిరామ్ చౌదరి, కాకినాడ; పంచమ బహుమతి: ప్రతాప వెంకట సుబ్బారాయుడు, సికిందరాబాద్‌లకు లభించాయి. విజేతలకి నేరుగా వారి ఫోన్ నెంబర్లకు నగదు బహుమతులను పంపడం జరుగుతుంది.
-చలపాక ప్రకాష్
సంపాదకుడు, రమ్యభారతి