చదువు

0
4

[dropcap]చ[/dropcap]దువూ చదువోరన్న
చదువుకు పదరన్న
పలకా బలపం బట్టి
పంచె నువ్ బిగ్గట్టి ॥ చదువూ ॥

కాయా కష్టం చేసి
గూటికి చేరిన వేళ
రాతిరి బడి వుందని
మరచిపోకు మాయన్న ॥ చదువూ ॥

కల్లూ పాకల కాడ
రచ్చ బండల నీడ
వేళంతా పాడు చేసి
వెతలా పాలుగాక ॥ చదువూ ॥

వేలి ముద్దర లెన్నాళ్ళు
వెట్టి చాకిరి యెన్నేళ్ళు
ఎదుగు బొదుగూ లేని
బడుగు బతుకు లెన్నాళ్ళు ॥ చదువూ ॥

అందాల అక్షరాలు
వెన్నెల రాదారులు
బతుకులో వెలుగు చూపె
ఎర్రెర్రని సూరీళ్ళు ॥ చదువూ ॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here