[dropcap]కా[/dropcap]లాలు, తేదీలు వచ్చెళ్లినా..!!
గడ్డాలు, మీసాలు నన్నల్లినా..!!
కొంతైనా మాయ నను చేయునా..!!
అందాల నా కలలకు అడ్డొచ్చునా..!!
కయ్యాలతో నువ్వు తలుపేసినా..!!
నీ తలపు నా హృదిని వీడెళ్ళునా..!
ఉయ్యాలూపంగ నిను చేరనా..!!
హుందాగా నా ముద్ర నింపెయ్యనా..!!
నిన్న మొన్న నాలో భావాలెన్నో ఉన్నా..!!
ఉలుకూ పలుకూ లేక మోడుబారాయి ..ఈడొచ్చినా..!!
నీ అలికిడి చూసి అవి గంతులేశాయి నేనొద్దంటున్నా..!!
నీ అండని చూసి కురిపించాయి పలుకుల వాన..!!
ఆ కొండా కోన ఈ చెట్టు చేమ..
నువ్వంటేనే పడిసస్తాయే ముద్దుల గుమ్మ..!!
కష్టం నష్టం అవి ఎంతటివైనా
నువ్వు గొంతు ఇవ్వనిదే పోరాడవులేమ్మా..!!
కులము మతము అంటూ మానవులెందరో విడి విడిగా ఉన్నా..!!
అందరి నోట పాటగా జారి జీవించును నీ కవితాత్మ..!!
కవితల కౌగిలి చేరనిదే
దేహం దాల్చదు కదా ప ద ని స..!!
ఎంత తిట్టినా కొట్టినా..
హావభావాల చీర కట్టనిదే
పరిపూర్ణత పొందదు ఆ కవితల వనిత..!!
కవిత భావుకతను కొలిచే ఘనత..
ఏ కొలతకు చేత కాదుగా..