[dropcap]ఇం[/dropcap]త పెద్ద దేశాన
సేద్యం బక్కచిక్కె
విడువక చేస్తున్న సేద్యం
జూదంగా మారే
గరిసెల, గింజ అడుగంటె
నీళ్ళేమో పాతాళమంటె
రైతు గుండెన దిగులు పొగిలె
***
రైతుదనం అంటె
చేతికందిన పంట
మనం తింటున్న తిండి
కడుతున్న బట్ట
***
ఈ అస్తవ్యస్థ తీరున
వ్యవసాయం ఎగసాగమాయె
ప్రకృతికి రైతుకి నడుమ
సమతుల్యం చెడె
***
నేల వేసిన విత్తు
చేతికందే వేళ
రాంబదుల్లా దళారీలు
విస్సన చెప్పిందే వేదం
వీళ్లు చెప్పిందే గింజ ధర
ఆ గతే రైతు తలరాత
***
హద్దు ఐపు లేని
మార్కెట్ మాయాజాలం
ఏ నియంత్రణా లేని
ప్రపంచీకరణ భాగోతం
అన్నీ కలిసిన బలుపు
దళారికి అమరిన వైభవం
వారే పాలకులైన వైనం
***
వెన్నెముక విరిగిన రైతు
కంకాళంగా మారిన కూలి
దిక్కుమాలి, బ్రతుకీడ్చే బడుగు
సజ్జా, కొర్రా, జొన్న అధిక
పెసర, వారిగ, కంది,
అనుము, మినుపు, అలసందె
వీటిని శోధించి మేలైన
చిరుధాన్యపు కరువైన నాణ్యత