[dropcap]ఎం[/dropcap]దుకు నాలో లేని ఆశలు రేకేతిస్తావు??
నువు ఉన్నావు అని సంబరపడ్డానో లేదో
చుట్టు సమస్యల వలయం కమ్మేసి నిరాశను మిగులుస్తున్నావు.
సుఖం బదులు దుఃఖాన్ని బహుమతిగా అందించావు
తెలియని బాధ, ఆవేదన, ఒంటరితనం నన్ను ఆవరించేశాయి
ఎవరి మీదో తెలియని కోపం, పైకి అరవాలని ఉంది
గట్టిగా హత్తుకొని ఏడ్వాలని ఉంది.. నేను మనిషిని కాదా?
నాకు మనసు ఉండదా??
అందరిని అర్థం చేసుకునే నన్ను అర్థం చేసుకునే వారే లేరు..
పనుల కోసం గుర్తుకు వస్తాను కాని నాకేం కావాలో
తెలుసుకువడానికి కేటాయించే సమయం ఉండదు.
ఎవరి స్వార్థం వారిదే. నేను స్వార్థపరురాలినే, ఆశాజీవినే
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ??నేను ఉన్నా అనే భరోసా లేదు
పరువు, ప్రతిష్ఠల కోసం పాకులాడే వారికి
ఏం చెప్పినా వినపడదు, అర్థం అవదు
విరక్తి కలుగుతుంది, బతుకు మీద..
ఏం చేసినా నా జీవితం మారదు.
నా కర్మ ఇంతే అని నా మనసుకు నచ్చచెప్పి
సాగిపోతు ఉన్నాను.. గమ్యం లేని భవిష్యత్తు వైపు….